అచ్చెదిన్ అంటే చెప్పుతో కొడతాడంట... | Madhyapradesh minister's son Controversial `Acche Din’ post

Minister s son controversial acche din post

Madhya Pradesh Minister Gauri Shankar, Mudit Shankar PM Modi, PM Narendra Modi, Narendra Modi, Narendra Modi acche din, acche din FB post, Minister Son acche din Post, Modi acche din New Currency, Mudit Shankar Facebook

Minister for forests Gauri Shankar Shejwar is upset with his son's controversial Facebook post on "Achhe Din".

మంత్రి కొడుక్కి మోదీ అంటే లెక్క లేదా?

Posted: 11/12/2016 07:54 AM IST
Minister s son controversial acche din post

పాత నోట్ల మార్పిడి వ్యవహారం ఏ స్థాయిలో ప్రశంసలు కురిపిస్తుందో.. సామాన్యులకు కరెన్సీ కష్టాలు చూపించటంపై అదే స్థాయిలో విమర్శలను గుప్పిస్తోంది. ఇక పలువురైతే మండిపోయి ప్రధానినే టార్గెట్ చేస్తూ వీడియో సందేశాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరోవైపు రాహుల్ గాంధీ నిన్న అంతా మోదీపై విమర్శలు గుప్పిస్తూనే ఉండగా, తాజాగా ఓ మంత్రి తనయుడు చేసిన నిర్వాకం తీవ్ర దుమారం రేపింది. తన ఫేస్ బుక్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి గౌరీశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్ షేజ్వార్ కూడా ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో ‘‘అవినీతి నిర్మూలన అంటేనే ‘అచ్చేదిన్’ వచ్చేసినట్లని, ఇకపై ఎవరైనా ‘అచ్చేదిన్’ ఎక్కడా అని అడిగితే చెప్పుతో కొడతానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

MP Minister son Achedin post

అయితే, తన పోస్ట్ నచ్చితే ‘లైక్’ లేకపోతే ‘అన్ లైక్’ చేయండి, అంతేకానీ, రాద్ధాంతం మాత్రం చేయొద్దంటూ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ కు లైక్ లతో పాటు విమర్శలూ వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై రాద్ధాంతమూ జరిగింది. మరోవైపు ఆ పోస్ట్ తన కొడుకు ఎందుకు చేశాడో తెలీదని, ఇప్పటి కాలంలో ఏం మాట్లాడినా రాద్ధాంతం అయిపోతుందని, ఇలాంటి వ్యవహారాల్లో ఎలా మసులుకోవాలో ముదిత్ ను తాను నచ్చజెప్పుతానని అతని తండ్రి, మంత్రి గౌరీశంకర్ వెనకేసుకురావటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles